కార్మిక వ్యతిరేక విధానాలను వీడాలి

ABN , First Publish Date - 2020-09-24T11:26:19+05:30 IST

బీజేపీ ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వీడాలని, లేకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని సీఐటీయూ, ఏఐటీసీ

కార్మిక వ్యతిరేక విధానాలను వీడాలి

 సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి. గౌ్‌స దేశాయ్‌


కర్నూలు(న్యూసిటీ), సెప్టెంబరు 23: బీజేపీ ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వీడాలని, లేకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని సీఐటీయూ, ఏఐటీసీయూ జిల్లా ప్రధాన కార్యదర్శులు డి.గౌ్‌సదేశాయ్‌, ఎస్‌.మునెప్ప హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్‌ ఎదుట కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీని పరిపాలన చేతకాకపోతే తప్పుకోవాలన్నారు.


కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కార్మికులు, ఉద్యోగుల, రైతులకు హాని కలిగించే విఽధంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో నిర్మల, పుల్లారెడ్డి, గోపాల్‌, సాయిబాబ, షరీఫ్‌ పాల్గొన్నారు.

 

గూడూరు: బీజేపీ ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని సీఐటీయూ డివిజన్‌ కార్యదర్శి జె మోహన్‌ అన్నారు. బుధవారం గూడూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో బస్టాండ్‌ సర్కిల్‌లో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా జె.మోహన్‌ మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది కలిగించే వ్యవసాయ బిల్లును రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.


సీఐ టీయూ నాయకులు వెంకటేశ్వర్లు, రాజు, శాంతన్న, దస్తగిరి, హమాలీ కార్మికులు మాధవరంగడు, మద్దిలేటి, మున్సిపల్‌ కార్మికులు మనోహరమ్మ, వెంకటేశ్వరమ్మ, ఆటో కార్మికులు రమేష్‌, రాముడు పాల్గొన్నారు.


పత్తికొండ టౌన్‌: బీజేపీ ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వీడాలని, లేకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఏఐటీయూసీ, సీఐ టీయూ నాయకులు కృష్ణ, సుల్తాన్‌, దస్తగిరి హెచ్చరించారు. బుధవారం పత్తికొండలో అంబేడ్కర్‌ సర్కిల్‌లో ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సీపీఐ నాయకులు రాజాసాహెబ్‌, సురేంద్ర, నెట్టికంటయ్య పాల్గొన్నారు.

 

కోడుమూరు: కార్మికుల హక్కుల కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి నశించాలని ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు. స్థానిక పంచాయతీ బోర్డు కార్యాలయం ముందు బుధవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ తాలుకా కార్యదర్శి హమాలీ రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలన్నారు. సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు గఫూర్‌ మియ్య, రాజు, మాధవస్వామి, వీరన్న పాల్గొన్నారు.

Updated Date - 2020-09-24T11:26:19+05:30 IST