కథలను ఆవిష్కరిస్తున్న వీసీ వీసీ రాజశేఖర్
ఏఎన్‌యూ, నవంబరు 27: ప్రముఖ బాలల సాహితీవేత్త షేక్ అబ్దుల్ హకీం జాని తెలుగులో అనువదించిన పంచతంత్ర కథలను ఏఎన్‌యూ వీసీ రాజశేఖర్ తన కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం జానీని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ వైఎస్‌ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఈదర శ్రీనివాసరెడ్డి, విశ్వవిద్యాలయ ప్రవేశాల సంచాలకులు డాక్టర్ వై.హరిబాబు తదితరులు పాల్గొన్నారు.