Abn logo
Feb 28 2021 @ 21:39PM

దర్శకుడితో.. ప్రేమలో అను ఇమ్మాన్యుయేల్‌?

కోలీవుడ్‌: గతంతో విశాల్‌ హీరోగా వచ్చిన చిత్రం ‘తుప్పరివాలన్‌’ చిత్రం ద్వారా కోలీవుడ్‌ వెండితెరకు పరిచయమైన హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయేల్‌. ఆ తర్వాత ఈమెకు తమిళంలో పెద్ద అవకాశాలు రాలేదు. 2019లో శివకార్తికేయన్‌ హీరోగా నటించిన ‘నమ్మ వీట్టు పిళ్ళై’ చిత్రంలో చాన్స్‌ వచ్చింది. ఈమెకు ఎక్కువగా టాలీవుడ్‌లో అవకాశాలు వచ్చాయి. అయితే, ఈ భామ ఇపుడు ఓ దర్శకుడుతో ప్రేమలో పడినట్టు కోలీవుడ్‌ అంతా గుసగుసలాడుతోంది.


ఆ దర్శకుడు ఎవరో కాదు.. ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం కమారుడు జ్యోతికృష్ణ. ‘యనక్కు 20.. ఉనక్కు 18’, ’కేడి’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘ఉల్లాల’అనే చిత్రంలో హీరోగా కూడా నటించారు. అదేవిధంగా తెలుగులో ‘ఆక్సిజన్‌’ అనే చిత్రానికి దర్శకత్వం వహించగా, ఇందులో అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా నటించింది. ఆ సమయంలో ఆమె.. దర్శకుడు జ్యోతికృష్ణతో ప్రేమలో పడినట్టు వార్తలు వచ్చాయి. ఈ కారణంగానే జ్యోతికృష్ణ తన భార్య ఐశ్వర్యతో తెగదెంపులు చేసుకున్నట్టు కోలీవుడ్‌ మీడియా కోడై కూస్తుంది. మరి దీనిపై ఇరువురు ఎలా రియాక్ట్ అవుతారో వెయిట్‌ చేద్దాం..

Advertisement
Advertisement
Advertisement