వర్సిటీలో జాతీయ సదస్సు

ABN , First Publish Date - 2021-03-03T05:49:24+05:30 IST

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో మోడరల్‌ ట్రెండ్స్‌ ఇన్‌ డ్రగ్‌ డెవలప్‌మెంట్‌ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు మంగళవారం ప్రారంభమైంది.

వర్సిటీలో జాతీయ సదస్సు
సదస్సు ప్రారంభిస్తున్న వీసీ

పెదకాకాని, మార్చి 2: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో మోడరల్‌ ట్రెండ్స్‌ ఇన్‌ డ్రగ్‌ డెవలప్‌మెంట్‌ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు మంగళవారం ప్రారంభమైంది. తొలుతగా వీసీ ఆచార్య పి.రాజశేఖర్‌ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరోనా వంటి విపత్కర సమయంలో ఫార్మాసిస్టులు, ఫార్మా కంపెనీలు ముఖ్యపాత్ర పోషించాయని తెలిపారు.  సదస్సుకు అధ్యక్షత వహించిన రెక్టార్‌ ఆచార్య పి.వరప్రసాదమూర్తి మాట్లాడుతూ ఫార్మసీ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎ.ప్రమీలారాణి, డైరెక్టర్‌ డాక్టర్‌ యు.అన్నపూర్ణ తదితరులు ప్రసంగించారు.  13 కళాశాలల నుంచిసుమారు 230 మంది విద్యార్థులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-03T05:49:24+05:30 IST