Abn logo
Aug 10 2020 @ 17:56PM

ఎట్టకేలకు అనుపమకు ఓ ఆఫర్?

`ప్రేమమ్` సినిమాతో దక్షిణాది సినీ ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది మలయాళీ ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్. ఆ తర్వాత తెలుగులో కూడా పలువురు యువ హీరోల సరసన నటించింది. అయితే అనపమకు ఇప్పటివరకు పెద్ద బ్రేక్ రాలేదు. దీంతో పెద్ద హీరోల సరసన అవకాశాలు రాలేదు. కొంతకాలంగా అనపమ టాలీవుడ్‌కు దూరంగా ఉంది. 


తాజాగా యంగ్ హీరో నిఖిల్ సరసన నటించే ఛాన్స్ అనుపమకు వచ్చిందట. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న `18 పేజెస్` సినిమాలో అనుపమ హీరోయిన్‌గా ఎంపికైందట. `కుమారి 21 ఎఫ్` దర్శకుడు సూర్య ప్రతాప్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాముఖ్యం ఉందట. కథ వినగానే ఈ సినిమాకు అనుపమ ఓకే చెప్పినట్టు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోందట. 

Advertisement
Advertisement
Advertisement