Abn logo
Sep 21 2020 @ 09:05AM

పాయల్‌కు అనురాగ్ కౌంటర్!

Kaakateeya

తనపై తప్పుడు ఆరోపణలు చేసిన నటి పాయల్ ఘోష్‌పై న్యాయస్థానం ద్వారా పోరాటం చేయాలని దర్శకుడు అనురాగ్ కశ్యప్ నిర్ణయించుకున్నారు. అనురాగ్ తరఫున ఆమె లాయర్ ప్రియాంక ఓ స్టేట్‌మెంట్‌ను విడుదల చేశారు. దానిని అనురాగ్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 


అనురాగ్ కశ్యప్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని, ఇంటికి పిలిచి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నటి పాయల్ ఘోష్ ఇటీవల ఆరోపించడం సంచలనంగా మారింది. ఆమె ఆరోపణలపై అనురాగ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని భావిస్తున్నారు. తప్పుడు ఆరోపణల కారణంగా తన క్లైంట్ మానసిక క్షోభను అనుభవిస్తున్నారని, తన హక్కులు పరిరక్షించుకునేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని నోటీసులో పేర్కొన్నారు. 



Advertisement
Advertisement
Advertisement