Delhi: భారత మహిళల హాకీ జట్టుకు అభినందనల వెల్లువ

ABN , First Publish Date - 2021-08-02T17:02:10+05:30 IST

టోక్యో ఒలింపిక్స్‌లో సెమీఫైనల్‌ చేరి మహిళల హాకీ జట్టు సత్తా చాటింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‎లో భారత్ విజయం 1-0 తేడాతో విజయం సాధించింది. ఆసీస్ పై గెలిచిన...

Delhi: భారత మహిళల హాకీ జట్టుకు అభినందనల వెల్లువ

ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో సెమీఫైనల్‌ చేరి మహిళల హాకీ జట్టు సత్తా చాటింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‎లో భారత్ విజయం 1-0 తేడాతో విజయం సాధించింది. ఆసీస్ పై గెలిచిన భారత్ మహిళల హాకీ జట్టుకు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు అభినందనల వెల్లువ కురించారు. ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో హాకీ జట్టు ఆకట్టుకుందని అనురాగ్‌ ఠాకూర్‌ పేర్కొన్నారు. ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించిందని, మహిళల హాకీ జట్టు వెనుక 130 కోట్ల మంది భారతీయులున్నారని వ్యాఖ్యానించారు.


కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు..

టోక్యో ఒలింపిక్స్‌లో భారతీయుల కల సాకారమవుతోందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. బలమైన ఆసీస్‌ జట్టును ఓడించి భారత్‌ సెమీస్‌కు దూసుకుపోయిందని కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-08-02T17:02:10+05:30 IST