`మా చిన్నారి దేవత` అంటూ Anushka పోస్ట్.. స్పందించిన బాలీవుడ్ స్టార్లు!

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ ప్రముఖ కథానాయిక అనుష్క శర్మ ఈ ఏడాది ఆరంభంలో తల్లిదండ్రులుగా మారారు. ఈ ఏడాది జనవరిలో అనుష్క పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిన్నారికి వామిక అని నామకరణం చేశారు. అయితే సోషల్ మీడియాకు తమ చిన్నారిని దూరంగా ఉంచాలనే కారణంతో అనుష్క, కోహ్లీ ఇప్పటివరకు వామికను ప్రపంచానికి పరిచయం చేయలేదు. 


తాజాగా వామికతో ఉన్న తన ఫొటోను అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఎప్పటిలాగానే వామిక మొహం కనిపించకుండా జాగ్రత్త పడింది. `రోజు రోజుకు నన్ను మరింత ధైర్యవంతురాలిగా మారుస్తున్నావు. నీలో ఉన్న దేవత నుంచి నువ్వు శక్తిని పొందుతున్నట్టు ఉన్నావు. హ్యాపీ దుర్గాష్టమి` అంటూ అనుష్క కామెంట్ చేసింది. ఈ ఫొటోపై పలువురు బాలీవుడ్ స్టార్లు స్పందించారు. ప్రముఖ హీరో రణ్‌వీర్ సింగ్ `ఓహ్-లే` అంటూ హార్ట్ ఎమోజీలను పోస్ట్ చేశాడు. ప్రియాంకా చోప్రా కూడా హార్ట్ ఎమోజీలు పోస్ట్ చేసింది. అతియా షెట్టి, వాణీ కపూర్, సానియా మీర్జా, తహీరా కశ్యప్ కూడా హార్ట్ ఎమోజీలను పోస్ట్ చేశారు. 




Advertisement

Bollywoodమరిన్ని...