Abn logo
Jan 13 2021 @ 15:10PM

హైదరాబాద్‌లో అనుష్క.. నెక్ట్స్ ఏంటి?

వెండితెరకు లాంగ్ బ్రేక్ ఇచ్చిన అనుష్క ఇటీవల `నిశ్శబ్దం` సినిమాతో ఓటీటీ ద్వారా పలకరించింది. ఆ సినిమా తర్వాత అనుష్క ఏం చేస్తోందనే విషయంలో ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అనుష్క కొత్త సినిమాల సంగతులేవీ బయటకు రాలేదు. అయితే తాజాగా ఆమె బయటకు వచ్చింది. 


తాజాగా హైదరాబాద్ విమానాశ్రయంలో అనుష్క కనిపించింది. హఠాత్తుగా అనుష్క కనిపించడంతో అభిమానులు, మీడియా ప్రతినిధులు తమ కెమేరాలకు పని చెప్పారు. తన తర్వాతి సినిమా పని మీదే అనుష్క హైదారాబాద్ వచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది. మరి, ఇప్పటికైనా అనుష్క తన కొత్త సినిమా సంగతులు చెబుతుందేమో చూడాలి. 

Advertisement
Advertisement
Advertisement