Abn logo
Oct 18 2020 @ 22:59PM

నీళ్లలో అనుష్క శర్మ, కోహ్లీ.. ఫొటో వైరల్‌

Kaakateeya

విరుష్క కపుల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అనుష్క శర్మ ప్రెగ్నెంట్‌ అనే విషయం అందరికీ తెలిసిందే. అనుష్క శర్మపై ఉన్న ప్రేమను వ్యక్త పరచడానికి కోహ్లీ అప్పుడప్పుడు కొన్ని ఫొటోలను పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆయన తన ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్‌ చేసిన ఫొటో చూస్తే.. అందరూ ఔరా అనాల్సిందే. ఎందుకంటే ఇద్దరూ గుండెల పై వరకు నీటిలో మునిగిపోయి.. ఒకరి కళ్లలోకి ఒకరు ప్రేమగా చూసుకుంటున్నారు. 

ఈ ఫొటోకి ప్రకృతి కూడా సహకరించడంతో.. చూసే వారిని ఈ ఫొటో బాగా ఆకర్షిస్తోంది. ఇక ఈ ఫొటోకి ఉన్న మరో విశేషం ఏమిటంటే.. క్రికెటర్‌ ఏబీ డెవిలియర్స్‌ ఈ ఫొటోని తీయడం. ఈ విషయం స్వయంగా కోహ్లీనే తెలిపారు. ప్రేమ ఉంటే చాలు.. సప్త సముద్రాలైనా ఈదేయవచ్చు అనేలా ఉంది ఫొటో, ప్రేమకు నిర్వచనం వీరిద్దరు అనేలా ఉంది ఫొటో.. అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తూ.. వారిద్దరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


Advertisement
Advertisement
Advertisement