Abn logo
Apr 7 2021 @ 14:40PM

కోహ్లీని పైకెత్తేసిన అనుష్క!

కెరీర్‌పై దృష్టి సారిస్తూనే, తమ వ్యక్తిగత జీవితానికి కూడా తగిన ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతోంది విరుష్క జోడి. ఇటీవలె ఈ జోడీ ఓ పండంటి ఆడ బిడ్డకు తల్లిదండ్రులుగా మారిన సంగతి తెలిసిందే. ఆ చిన్నారికి `వామిక` అని నామకరణం చేశారు. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉండే అనుష్క తాజాగా ఇన్‌స్టాలో పంచుకున్న ఓ వీడియో వైరల్‌ అవుతోంది. ఇందులో భర్త కోహ్లిని అనుష్క ఎత్తుకుంది.


దీంతో కోహ్లీ `నిజంగానే నువ్వు నన్ను ఎత్తుకున్నావా? మళ్లీ ఎత్తుకో` అని అడిగాడు. `నువ్వు నాకు సహాయం చేయకూడదు` అంటూ తానే కోహ్లీని రెండోసారి పైకి ఎత్తేసింది. అనంతరం తన కండలు చూపించింది. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. `సూపర్ కపుల్` అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 



Advertisement
Advertisement
Advertisement