Advertisement

ANUSHKA SHARMA : గర్భం దాల్చిన మొదట్లో ‘ఆ విషయం’ గురించి చాలా భయపడ్డాను

తాను గర్భం దాల్చిన తొలినాళ్లలో మనస్సు ఆందోళనగా, గందరగోళంగా ఉండేదని అనుష్కా శర్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. విరాట్ తన పక్కనే ఉండటం అప్పట్లో ఎంతో మానసిక స్థైర్యం కలిగించిందని కూడా ఆమె వివరించింది. అనుష్క గత సంవత్సరం కరోనా లాక్‌డౌన్ టైంలో తల్లి కావాలని నిర్ణయించుకుంది. అప్పుడు టీమిండియా కెప్టెన్ విరాట్ కూడా ఇంటిపట్టునే ఉండటంతో ‘ప్రెగ్నెంట్ అనుష్క’ హ్యాపీగా ఫీలైందట. లాక్‌డౌన్ లేకపోయి ఉంటే విరాట్ క్రికెట్ కోసం దేశదేశాలు తిరుగుతూ తన పక్కన ఉండేవాడు కాడంటోంది అనూ. అదే జరిగి ఉంటే గర్భధారణ తొలి రోజుల్లో తనకు చాలా మానసిక ఇబ్బంది కలిగేదని చెప్పింది. 


గత జనవరిలో కూతురు ‘వామిక’కు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన మమ్మీ అనుష్క, పాప పుట్టక ముందు తన స్థితి గురించి, మరిన్ని ముచ్చట్లు చెప్పింది. తాను ప్రెగ్నెంట్ అని తెలిసిన మొదట్లో ఆమె తెగ భయపడేదట! ‘‘అసలు నేను తల్లిగా మారటాన్ని ఆస్వాదించగలనా? తల్లి అయ్యాక నాకు ఆ స్థితి నచ్చుతుందా?’’ వంటి ప్రశ్నలు ఆమెకు కలిగేవట! అయితే, కూతురు పుట్టాక ఇప్పుడు తాను ఎంతో ఎదిగానంటోంది అనుష్క. ఒక వ్యక్తిగా బాగా మారానని బాలీవుడ్ బ్యూటీ చెబుతోంది! 

Advertisement

Bollywoodమరిన్ని...