అనుష్కశర్మ కంపెనీతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో 54 మిలియన్ల డాలర్ల డీల్!

ABN , First Publish Date - 2022-01-26T01:07:30+05:30 IST

టీమిండియా మాజీ సారథి కోహ్లీ భార్య అనుష్కశర్మతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో 54 మిలియన్..

అనుష్కశర్మ కంపెనీతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో 54 మిలియన్ల డాలర్ల డీల్!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారథి కోహ్లీ భార్య అనుష్కశర్మతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో 54 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అనుష్కశర్మ ప్రొడక్షన్ హౌస్ ‘క్లీన్ స్లేట్ ఫిలింజ్ ప్రైవేట్’తో కలిసి సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఈ రెండూ విడుదల చేయనున్నాయి.


తన సోదరుడు కర్నేష్ శర్మతో కలిసి అనుష్క ఈ బ్యానర్‌ను నిర్వహిస్తున్నారు. ఈ బ్యానర్‌పై గతంలో నెట్‌ఫ్లిక్స్‌లో ‘బల్బుల్’, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘పాతాల్ లోక్’ సినిమాలను విడుదల చేశారు. ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి 2015లో ‘ఎన్‌హెచ్10’ అనే చిత్రం వచ్చింది. వీటితోపాటు టీమిండియా మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి బయోపిక్ ‘చక్దా ఎక్స్‌ప్రెస్’, ‘మై’, ‘కాలా’ వంటి చిత్రాలు ఈ బ్యానర్ మీదనే విడుదలయ్యాయి.


భారత్‌లో మరింత మందికి చేరువయ్యేందుకు నెట్‌ఫ్లిక్స్ గత నెలలో సబ్‌స్క్రిప్షన్ ధరలను భారీగా తగ్గించింది. తద్వారా ఓటీటీ రంగంపై పట్టు సాధించాలని భావిస్తోంది. కరోనా భూతం ఇంకా భయపెడుతున్న నేపథ్యంలో బాలీవుడ్‌లో చాలా వరకు సినిమాలు ఓటీటీలోనే విడుదలవుతున్నాయి. 


Updated Date - 2022-01-26T01:07:30+05:30 IST