Oct 23 2021 @ 10:42AM

డార్లింగ్‌కు స్వీటీ స్పెషల్ విషెస్..

నేడు (అక్టోబర్ 23) డార్లింగ్, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయనకు స్వీటీ అనుష్క శెట్టి స్పేషల్‌గా విషెస్ తెలిపారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రాల యూనిట్ సభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్‌తో జంటగా నటించిన స్టార్ హీరోయిన్, తన క్లోజ్ ఫ్రెండ్స్‌లో ఒకరైన అనుష్క శెట్టి బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె.. "లైఫ్‌లో వచ్చే ప్రతి అంశంలో ప్రభాస్ బెస్ట్‌గా ఉండాలని, అలాగే తన స్టోరీస్ అన్నీ సక్సెస్ అయి అందరి హృదయాలను గెలుచుకోవాలని కోరుకుంటున్నాను"..అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే కూ యాప్‌లో కూడా విషెస్ పోస్ట్ చేశారు. కాగా ప్రభాస్ - అనుష్క కలిసి బిల్లా, మిర్చి, బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్‌క్లూజన్ లాంటి చిత్రాలో నటించిన సంగతి తెలిసిందే.