తెగ ‘అన్వేషిం’చారు!

ABN , First Publish Date - 2020-08-19T05:38:57+05:30 IST

అన్వేషి జైన్‌... ‘గందీ బాత్‌-2’ చూసినవాళ్లకు ఈమెను పరిచయం చేయక్కర్లేదు. మోడల్‌గా, నటిగా, హోస్ట్‌గా, డేటింగ్‌ కోచ్‌గా... విభిన్న పాత్రల్లో ఇట్టే ఒదిగిపోతున్న అన్వేషిని గూగుల్‌లో తెగ వెతికేశారట...

తెగ ‘అన్వేషిం’చారు!

అన్వేషి జైన్‌... ‘గందీ బాత్‌-2’ చూసినవాళ్లకు ఈమెను పరిచయం చేయక్కర్లేదు. మోడల్‌గా, నటిగా, హోస్ట్‌గా, డేటింగ్‌ కోచ్‌గా... విభిన్న పాత్రల్లో ఇట్టే ఒదిగిపోతున్న అన్వేషిని గూగుల్‌లో తెగ వెతికేశారట. దాని ఫలితమే 2019లో ‘మోస్ట్‌ సెర్చ్‌డ్‌ యాక్ర్టెస్‌’గా రికార్డులకెక్కిందీ భామ. ఈమె కోసం మొత్తం 30 మిలియన్ల మంది గూగుల్‌లో శోధించారట!ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఈ అమ్మాయిది మధ్యప్రదేశ్‌. ‘ఎలక్ర్టికల్‌ అండ్‌ ఎలక్ర్టానిక్‌ ఇంజనీరింగ్‌’ పట్టా పొందిన అన్వేషి... ఖజురహో సమీపంలోని తన సొంతూరులో కొంతకాలం చిన్నపాటి వ్యాపారం చేసింది. అది నచ్చక, గ్లామర్‌ ఫీల్డ్‌ మీద నున్న మోజుతో ఇంట్లో చెప్పకుండా ముంబయికి మకాం మార్చేసింది. 


లెక్కకు మించి ఈవెంట్లకు హోస్ట్‌గా వ్యవహరించిన ఈ బ్యూటీ ‘గందీ బాత్‌-2’తో ఒక్కసారిగా స్టార్‌ అయిపోయింది. అది మొదలు మళ్లీ వెనక్కి తిరిగి చూసుకొనే అవరం రాలేదు. వీటన్నింటితో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటూ అలరిస్తోంది.  


ఇన్‌స్టాగ్రామ్‌లో అన్వేషి ఫాలోవర్స్‌ ఎంతమందో తెలుసా? 2.9 మిలియన్లమంది. ఫేస్‌బుక్‌లో అయితే 3.4 మిలియన్లమంది ఉన్నారు. యూట్యూబ్‌లో లక్షకు పైగా చందాదారులతో దూసుకుపోతున్న ఈ మధ్యప్రదేశ్‌ ముద్దుగుమ్మ తన పేరిటే ఓ యాప్‌ను కూడా ప్రారంభించింది. అందులో చందాదారులకు లైవ్‌లో అందాల విందు చేస్తోంది. డేటింగ్‌ పాఠాలూ నేర్పుతోంది. 


Updated Date - 2020-08-19T05:38:57+05:30 IST