Advertisement
Advertisement
Abn logo
Advertisement

బ్రహ్మంగారి మఠంలో పీఠాధిపతి పదవిపై ఉత్కంఠ

కడప: జిల్లాలోని ప్రఖ్యాతి గాంచిన బ్రహ్మంగారి మఠంలో పీఠాధిపతి పదవిపై ఉత్కంఠ కొనసాగుతోంది. రెండు వారసత్వ కుటుంబాలతో రెండో రోజు కూడా పీఠాధిపతులు చర్చలు జరిపారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని శైలక్షేత్రాల నుంచి 12 మంది పీఠాధిపతులు వచ్చారు. పదవిపై ఇరు కుటుంబాలు పట్టువీడడం లేదు. దీంతో పీఠాధిపతుల చర్చలు ఫలించలేదు. అయితే  పీఠాధిపతి పదవిపై ఆలోచించుకోవాలని పీఠాధిపతులు నాలుగు రోజుల సమయం ఇచ్చారు. ప్రజాసంఘాలు, కుల సంఘాలు, భక్తుల అభిప్రాయాలను పీఠాధిపతులు తీసుకున్నారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరించి దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఘనంగా పట్టాభిషేకం జరుగుతుందని పీఠాధిపతులు ఆశాభావం వ్యక్తం చేశారు. 

Advertisement
Advertisement