సంరక్షణ ఏదీ?

ABN , First Publish Date - 2021-03-02T04:44:34+05:30 IST

పల్లెల్లో మరిం త ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకు ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పనులను ప్రారంభించిన అధికారులు పనులు పూర్తి చేయాలని హడావిడి చేస్తున్నారు.

సంరక్షణ ఏదీ?
నేరడిగొండ మండలం లక్కంపూర్‌ పంచాయతీ పరిధిలోని చించోలి పల్లె ప్రకృతి వనంలో సంచరిస్తున్న పశువులు

పల్లె ప్రకృతి వనాల్లో పశువుల సంచారం

కాగితాలకే పరిమితమైన ప్రగతి నివేదికలు

ఎంత హడావిడి చేసినా అదే నిర్లక్ష్యం

జిల్లాలో మొక్కుబడిగా పల్లె వనాల పనులు

ఆదిలాబాద్‌, మార్చి1 (ఆంధ్రజ్యోతి): పల్లెల్లో మరిం త ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకు ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పనులను ప్రారంభించిన అధికారులు పనులు పూర్తి చేయాలని హడావిడి చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పల్లె ప్రకృతి వనాల పరిస్థితి అధ్వానంగా త యారవుతోంది. ఏదో ఊరు చివరన హడావిడిగా ఏర్పాటు చేసి వదిలేయడంతో అప్పుడే  మైదాన ప్రాంతాలుగా మారిపోతున్నాయి. సరైన పర్యవేక్షణ లేక పోవడంతో పల్లె వనాలపై పట్టింపే లేకుండా పో తోంది. జిల్లాలో 468 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 912 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఇప్పటి వరకు 790 ప్రకృతి వనాల పనులు పూర్తయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. కాగా, మరో 122 ప్రకృతి వనాల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇచ్చోడ మండ లంలోని ముఖ్ర(కె) గ్రామంలో మోడల్‌ పల్లె ప్రకృతి వనాన్ని నిర్మించి పచ్చదనంతో తీర్చిది ద్దారు. మిగతా గ్రామాల్లో ఈ విధంగానే ప్రకృతి వనాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినా ఆచరణ సాధ్య ం కావడం లేదు. మెజార్టీ గ్రామాల్లో స్థల సేకరణ పెద్ద సమస్యగా మారి ఊరికి దూరంగా అటవీ ప్రాంతాల్లో పనులు చేపడుతున్నారు. దీంతో పల్లె ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందనంత దూరమవుతోంది. ఉపాధి హామీ నిధుల కింద ఒక్కో ప్రకృతి వనానికి రూ.6లక్షలు నిధులు మంజూరు చేశారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 3.6 కోట్ల రూపాయ లు ఖర్చు చేసినట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. జిల్లా ఉన్నతాధికారులు తరచూ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ప్రగతి నివేదికలను ప్రభుత్వానికి పంపుతున్న పనులు మాత్రం నత్తనడకనే సాగుతున్నాయి. కొందరు సర్పంచ్‌లు పకడ్బందీగా పనులు చేపట్టక పోవడం సరైన పర్యవేక్షణ చేయక పోవడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారి పోతోంది. జిల్లా అధికారులు హెచ్చరికలు చేస్తున్నా అనుకున్నంత స్థాయిలో పనులు ముందుకు సాగడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లక్ష్యానికి అను గుణంగా పనులు జరుగక పోవడంతో కోట్ల రూపాయల నిధులు నేలపాలు చేస్తున్నారన్న ఆరోపణలు లేక పోలేదు. 

పొంతన లేని లెక్కలు..

పల్లె ప్రకృతి వనాల్లో నాటిన మొక్కలకు అధికారుల నివేదికలకు ఎలాంటి పొంతన లేకుండానే పోతుందన్న ఆరోపణలు వస్తున్నాయి. తక్కువ మొక్కలునాటి ఎక్కువ సంఖ్యను చూపుతున్నారన్న విమర్శలున్నాయి. ఒక వేళ నాటిన సంరక్షణ చర్యలు చేపట్టక పోవడంతో కనిపించకుండానే పోతున్నాయి. అసలే వేసవి కాలం కావడంతో మొక్కల సంరక్షణ సవాల్‌ గా మారుతోంది. కానీ కొన్ని గ్రామ పంచాయతీల్లో వారాల తరబడి మొక్కలకు నీరందించిన పరిస్థితులు కనిపించడం లేదు. పల్లె ప్రకృతి వనాల చుట్టూ భారీ వృక్ష జాతీ మొక్కలను నాటి మధ్య మ ధ్యలో పూల మొక్కలు, ఔషధ మొక్కలను నాటాల్సి ఉంటుంది. అలాగే చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటు చేసి మొక్కల సంరక్షణకు చర్యలు చేపట్టాలి. ఇప్పటికి ఎన్నో గ్రామాల్లో కంచెను ఏర్పాటు చేయక పోవడం తో పశువుల సంచారం పెరిగి పోయి నాటిన మొక్కలు ధ్వంసమవుతున్నాయి. మళ్లీ మొక్కలు నాటడం నిర్లక్ష్యంగా వదిలేయడం పరిపాటిగానే మారుతోంది. ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో నర్సరీని ఏర్పాటు చేసుకుని అందులో పెంచిన మొక్కలనే నాటాల్సి ఉంది. దీనికి పంచాయతీ నిధుల నుంచి 10 శాతం ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ కొందరు సర్పంచ్‌లు ఇతర ప్రాంతాల నుంచి మొక్కలను కొ నుగోలు చేస్తూ తప్పుడు బిల్లులతో కాకీ లెక్కలు చెబుతు కొంత సొమ్మును జేబులో వేసుకుంటున్నా రన్న ఆరోపణలు వస్తున్నాయి. 

అడుగడుగునా అదే నిర్లక్ష్యం..

పల్లె ప్రకృతి వనాల ఏర్పాటులో అడుగడుగునా అదే నిర్లక్ష్యం కనిపిస్తోంది. వీటిపై కొందరు సర్పంచ్‌లు అంతగా ఆసక్తి చూపించినట్లు కనిపించడం లేదు. ఏదో అధికారుల ఒత్తిళ్లతో పనులు చేస్తున్నట్లు హడావిడి చేయడం ఆ తర్వాత అంత మరిచి పోవడంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారుతోంది. దీంతో ప్రకృతి వనాల పనులు నామ్‌కే వాస్తేగా సాగుతున్నాయి. అధికారులు ఎంత హడా విడి చేసినా ఆశించిన ఫలితం దక్కడం లేదు. ఏదో మొక్కలు నాటామా, వదిలేశామా అన్నట్లుగా సర్పం చ్‌ల తీరు కనిపిస్తోంది. జిల్లాలో కొనసాగుతున్న ప్రకృ తి వనాల పనులు నగుబాటుగా మారుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్‌, నీటి ట్యాంకర్లను అందజేసిన సక్రమంగా సద్వినియోగం కావడం లేదు. క్రమం తప్పకుండా మొక్కలకు నీటిని సరఫరా చేయక పోవ డంతో మొలక దశలోనే వాడు ముఖం పట్టి ఎండి పోతున్నాయి. గ్రామాల్లో జరుగుతున్న ఇతర అభివృ ద్ధి పనుల్లో సర్పంచ్‌లు బిజీగా మారిపో వడంతో సిబ్బంది ప్రకృతి వనాల జోలికి వెళ్లడం లేదు. అడ పదడపగా ఉన్నతాధికారుల పర్యటనల సందర్భం గా మొక్కలకు నీళ్లు పోయడం ఆ తర్వాత వదిలేసినట్లే కనిపిస్తోంది. ప్రకృతి వనాల చుట్టుకంచెను ఏర్పాటు చేయక పోవడంతో మొక్కలు నాటినా అంత గా ప్రయోజనం ఉండదంటున్నారు.

నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు..

: శ్రీనివాస్‌, జిల్లా పంచాయతీ అధికారి

పల్లె ప్రకృతి వనాలపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్ప వు. అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో సరిపడా నిధులు అందుబాటులో ఉన్నాయి. పంచాయతీ నిధుల నుంచి 10 శాతం ప్రకృతి వనాలు, నర్సరీల నిర్వహణకు సద్వినియోగం చేసే వెసులుబాటు ఉంది. అన్ని ప్రకృతి వనాల చుట్టూ ఇనుప జాలి కంచెను ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా వేసవిలో మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టిని సారించాలని గ్రామ కార్యదర్శులను ఆదేశించాం.

Updated Date - 2021-03-02T04:44:34+05:30 IST