Jun 24 2021 @ 01:22AM

నచ్చితే ఎలాంటి పాత్రయినా ఓకే!

పాత్ర డిమాండ్‌ చేస్తే నగ్నంగా నటించడానికి అభ్యంతరం లేదని కొంతమంది కథానాయికలు బోల్డ్‌ స్టేట్‌మెంట్‌లు ఇస్తుంటారు. చెప్పడమే కాదు నగ్నంగా నటించారు కథానాయిక ఆండ్రియా. తమిళంలో మిస్కిన్‌ దర్శకత్వంలో ప్రస్తుతం ‘పిశాసు’కు సీక్వెల్‌ తెరకెక్కుతోంది. ఇందులో కీలక సన్నివేశంలో నగ్నంగా నటించాల్సి ఉందనే విషయం తెలిసే ఆండ్రియా సినిమా అంగీకరించారు. ఇటీవల కొద్దిమంది యూనిట్‌ సుభ్యుల సమక్షంలో ఆ సన్నివేశాలను దర్శకుడు పూర్తి చేశారట. ‘నాకు నచ్చితే ఎలాంటి పాత్రలోనయినా నటిస్తాను’ అని ఆండ్రియా  స్పందించారు. తమిళనాడు ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతులు ఇవ్వడంతో చెన్నైలో చిత్రీకరణలు ప్రారంభమయ్యాయి.