విచిత్ర ఆచారం: ఆ కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే మహిళలను జీవితాంతం వేధించే కఠిన శిక్ష.. అదేమిటో తెలిస్తే షాకవుతారు!

ABN , First Publish Date - 2021-11-03T16:12:43+05:30 IST

ప్రపంచంలోని పలు దేశాల్లో అత్యంత ప్రమాదకర..

విచిత్ర ఆచారం: ఆ కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే మహిళలను జీవితాంతం వేధించే కఠిన శిక్ష.. అదేమిటో తెలిస్తే షాకవుతారు!

ప్రపంచంలోని పలు దేశాల్లో అత్యంత ప్రమాదకర ఆచార సంప్రదాయాలు ఉన్నాయి. వీటి గురించి తెలుసుకుంటే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ప్రపంచంలోని కొన్ని దేశాల ఉనికి బాహ్య ప్రపంచానికి అంతగా తెలియదు. కొన్ని దేశాల్లోని ఆచార సంప్రదాయాల పేరిట జరిగే అరాచాకాలకు అక్కడి ప్రభుత్వాలు అడ్డుకట్టవేస్తుంటాయి. కొన్ని దేశాల్లో మాత్రం విచిత్రమైన ఆచార సంప్రదాయాలు నేటికీ కొనసాగుతున్నాయి. ఆ దేశంలోని ఏ కుటుంబంలోనైనా ఎవరైనా చనిపోతే ఆ ఇంటిలోని మహిళల వేళ్లను నరికేస్తారు. ఇండొనేషియాలోని ఒక ఆదివాసీ తెగ ఈ ఆచారాన్ని పాటిస్తుంటుంది. 


మీడియాకు అందిన సమాచారం ప్రకారం దానీ జాతికి చెందిన కుటుంబంలో ఎవరైనా మృతి చెందితే ఆ ఇంటిలోని మహిళలు తమ చేతి వేళ్లను సగభాగానికి కట్ చేయించుకోవాల్సిఉంటుంది. ఇలా చేయడం వలన మరణించిన వారి ఆత్మ వీరికి దూరంగా వెళ్లిపోతుందని వీరు నమ్ముతుంటారు. ఈ దుర్మార్గపు ఆచారాన్ని అక్కడి ప్రభుత్వం ఎప్పుడో నిషేధించనప్పటికీ పలువురు దొంగచాటుగా ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు.  ఈ జాతివారు ఇండోనేషియాలోని పశ్చిమ న్యూ గినీ పర్వత ప్రాంతాల్లో ఉంటారు. 



Updated Date - 2021-11-03T16:12:43+05:30 IST