Abn logo
Nov 23 2020 @ 02:51AM

వరద సాయం ఏదీ?.. ఎందుకు ఓటెయ్యాలి?

అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్న బాధితులు

రాంనగర్‌, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ప్రచారానికి వెళుతున్న అభ్యర్థులకు వరద సహాయం అందని బాధితులు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. తమకు వరద సహాయం అందలేదని.. టీఆర్‌ఎ్‌సకు ఎందుకు ఓటు వేయాలని నిలదీస్తున్నారు.

అడిక్‌మెట్‌ డివిజన్‌లోని దయానంద్‌నగర్‌, ఆజామాబాద్‌, మేడిబాయి బస్తీలో జరిగిన ప్రచార సభలో పాల్గొన్న మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌, ఎమ్మెల్యే గోపాల్‌ను పలువురు మహిళలు వరద సాయంపై ప్రశ్నించారు. దీంతో.. బీజేపీ నేతలు అడ్డుకున్నారని.. అందుకే ఆగిపోయిందని మంత్రి, ఎమ్మెల్యే నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. 


Advertisement
Advertisement