‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’పై చిత్తశుద్ధి ఏదీ?

ABN , First Publish Date - 2021-05-18T06:00:14+05:30 IST

‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’లో భాగంగా సోమవారం స్థానికంగా నిర్వహించిన సర్పంచులకు ఒకరోజు అవగాహన సమావేశం బోసిపోయింది.

‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’పై చిత్తశుద్ధి ఏదీ?
యాడికిలో శిక్షణకు హాజరైన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది

జూమ్‌ యాప్‌ శిక్షణకు సగం మంది సర్పంచులు డుమ్మా


యాడికి, మే 17: ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’లో భాగంగా సోమవారం స్థానికంగా నిర్వహించిన సర్పంచులకు ఒకరోజు అవగాహన సమావేశం బోసిపోయింది. కేవలం ఏడుగురు సర్పంచులు మాత్రమే హాజరుకావడం గమనార్హం. మండలవ్యాప్తంగా 14 గ్రామ పంచాయతీలు ఉండగా 7 గ్రా మ పంచాయతీల సర్పంచులు మాత్రమే సమావేశానికి హాజరుకావడం స్వచ్ఛ సంకల్పంపై చిత్తశుద్ధి ఎక్కడ ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జూమ్‌ యాప్‌ ద్వారా పారిశుధ్యంపై అవగాహన చేపట్టిన శిక్షణకే హాజరుకాకపోతే, ఆయా గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య పనులు ఏమేరకు నిర్వ హిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నిట్టూరు, చిక్కేపల్లి, కమలపాడు, నగరూరు, యాడికి, వేములపాడు, తూట్రాళ్లపల్లి పంచాయతీల సర్పంచులు మాత్రమే శిక్షణకు హాజరయ్యారు. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో చేపట్టాల్సిన పారిశుధ్య పనుల నిర్వహణ శిక్షణకు అన్ని గ్రామ పంచాయతీ ల సర్పంచులు హాజరయ్యేలా అధికారులు అవగాహన కల్పించి ఉండాల్సిం ది అనే వాదనలు వినిపిస్తున్నాయి.


యల్లనూరు : మండలంలో సోమవారం జగనన్న స్వచ్ఛ సంకల్పంపై సర్పంచులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. గ్రామాల్లో పారిశుధ్య పనులు, కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను జూమ్‌యాప్‌ ద్వారా తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఓబులమ్మ, ఈఓఆర్‌డీ విజయశేఖర్‌నాయుడు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు.


విడపనకల్లు : మండలంలోని వివిధ గ్రామాల సర్పంచలు, వార్డు మెం బర్లు, పంచాయతీ కార్యదర్శులకు కరోనా నివారణపై జూమ్‌ యాప్‌ మీ టింగ్‌ను ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. గ్రామాల్లో జ్వర పీడితులను గుర్తించి వారికి తగిన చికిత్స చేయించాలన్నారు. ప్రతి పంచాయతీలోను పారిశుధ్య పనులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఈఓఆర్డీ చంద్రమౌళి, కార్యదర్శులు, సర్పంచలు పాల్గొన్నారు.


వజ్రకరూరు : కొవిడ్‌, ఉపాధి హామీ పథకం, శానిటైజేషన పనుల్లో సర్పంచలు బాధ్యతగా వ్యవహరించాలని పంచాయతీ రాజ్‌ శాఖ కమిషన ర్‌ రవికుమార్‌ సూచించారు. సోమవారం జూమ్‌ యాప్‌ ద్వారా సర్పంచలతో స్థానిక వెలుగు కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. కరోనావే ళ ప్రాణాలను తెగించి విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులకు పీపీ కిట్లను అందజేయాలన్నారు. సకాలంలో వారికి వేతనాలు చెల్లించాలన్నారు. ప్రజలకు కొవిడ్‌పై అవగాహన కల్పించాలన్నారు. కర్ఫ్యూ, లాక్‌డౌన్ల నేపథ్యంలో ప్రజల ఆర్థిక స్థితి దెబ్బతినకుండా ఉపాధి హామీ ద్వారా గ్రామాల్లో పనులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రెహనాబేగం, సర్పంచులు పాల్గొన్నారు.


రాయదుర్గం రూరల్‌ : గ్రామాలను పరిశుభ్రంగా వుంచేందుకు సర్పంచలు నడుం బిగించాలని పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ తెలిపినట్లు ఎంపీడీవో కొండయ్య పేర్కొన్నారు. సోమవా రం పట్టణంలోని బాలికోన్నత పాఠశాలలో 19 పంచాయతీ సర్పంచలకు జూమ్‌ యాప్‌ ద్వారా జగనన్న స్వచ్చత సేవా కార్యక్రమంపై ఒక్కరోజు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. 


కణేకల్లు : గ్రామాల్లో పరిశుభ్రతను పాటించి వ్యాధులను దూరం చే యాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న స్వచ్ఛ సంకల్పంపై ప్రతిఒక్కరు అవగాహన పొందాలని ఎంపీడీవో విజయభాస్కర్‌ కోరారు. సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచలు, కార్యదర్శులకు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. కార్యక్రమంలో ఈవోఆర్డీ గూడెన్న, సర్పంచులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-18T06:00:14+05:30 IST