Abn logo
Sep 21 2020 @ 06:18AM

438 కేసుల నమోదు

ఏలూరు, సెప్టెంబరు 20 : గత రెండు రోజులుగా జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. శనివారం 606 కేసులు నమోదుకాగా ఆదివారం 438 మందికి మాత్రమే పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చింది. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 63,144కు చేరుకుంది. ఈ రోజు అత్యధికంగా తాడేపల్లి గూడెంలో 69, ఆ తర్వాత ఏలూరు 33 కేసులు వెలుగు చూశాయి.  భీమవరం 30, నిడదవోలు 13, తణుకు 12, పాలకొల్లు 11, జంగారెడ్డిగూడెం 11, నరసాపురం 4, ఆకివీడు 4, చొప్పున కేసులు నమోదయ్యాయి. గ్రామీణ మండలాల్లో వీరవా సరంలో 32, పెదపాడులో 21, నల్లజర్ల 20, టి.నరసా పురం 19, పెంట పాడు 14, ఉంగుటూరు 13, బుట్టాయ గూడెం 11, దెందులూరు 11, లింగపాలెం 10, మొగల్తూరు 9, అత్తిలి 8 కేసులు రాగా, గోపాలపురం, చాగల్లు, పెనుగొండ, భీమడోలు, యలమంచిలి, ఉండి, పెరవలి, జీలుగుమిల్లి మండలాల్లో ఐదుకంటే తక్కువ  నమోద య్యాయి. కరోనా కారణంగా ముగ్గురు మరణించగా.. ఈ సంఖ్య ఇప్పటి వరకు 417కు చేరింది. 

Advertisement
Advertisement
Advertisement