ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా

ABN , First Publish Date - 2021-11-27T00:31:39+05:30 IST

ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. ఏడు రోజుల

ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా

అమరావతి: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. ఏడు రోజుల పాటు  సమావేశాలు జరిగాయి. 34 గంటల 50 నిమిషాలు పాటు అసెంబ్లీ జరిగింది. ఈ సమావేశాలలో 26 బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. వాడీ వేడిగా ఈసారి అసెంబ్లీ సెషన్‌ కొనసాగింది. సీఎం అయితేనే అసెంబ్లీకి వస్తానంటూ చంద్రబాబు శపథం చేశారు.


అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేసింది. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టాలను రద్దు చేస్తూ గతంలో చేసిన చట్టాలను వెనక్కి తీసుకుంటూ అసెంబ్లీలో బిల్లుకు ఆమోదo తెలిపింది. శాసనమండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం మరో తీర్మానం చేసింది. 2021 జనాభా లెక్కల్లో బీసీ కులగణన చేపట్టాలని తీర్మానం చేసి కేంద్రానికి నివేదనను పంపింది. సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు చేస్తూ చట్టసవరణ చేశారు. త్వరలో ఆన్‌లైన్‌లోనే సినిమా టికెట్ల అమ్మకాలు జరుగనున్నాయి. ఆన్‌లైన్‌ పోర్టల్‌ని  ఏపీఎఫ్‌డీసీ నిర్వహించనుంది. 



Updated Date - 2021-11-27T00:31:39+05:30 IST