Chandrababu అసెంబ్లీలోకి వెళ్తుండగా మార్షల్ ఓవరాక్షన్.. ఫోన్‌తో..!

ABN , First Publish Date - 2021-11-19T15:14:56+05:30 IST

అమరావతి: అసెంబ్లీ శాసన సభ ప్రాంగణంలో ఓ మార్షల్ ఓవరాక్షన్ చేశాడు.

Chandrababu అసెంబ్లీలోకి వెళ్తుండగా మార్షల్ ఓవరాక్షన్.. ఫోన్‌తో..!

అమరావతి : అసెంబ్లీ శాసన సభ ప్రాంగణంలో మార్షల్ ఓవరాక్షన్ చేశాడు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సభలోకి వెళ్తున్న సమయంలో ఓ మార్షల్ ఫోన్‌తో విజువల్ షూట్ చేశాడు. దీంతో మార్షల్ తీరుపై చంద్రబాబు సెక్యూరిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. మార్షల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై చీఫ్ మార్షల్ చంద్రబాబుకు క్షమాపణ చెప్పారు. మార్షల్ చర్యపై టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సభలో ప్రస్తావించే అవకాశముంది.


కాగా.. ఇవాళ రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. టిడ్కో ఇళ్ల కేటాయింపు, ఇళ్ల స్థలాల సేకరణలో అవినీతిపై టీడీపీ వాయిదా తీర్మానం ఇవ్వగా.. ఆ తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని తిరస్కరించారు. దీంతో టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ చర్చ అనంతరం యథావిధిగా మళ్లీ సభ్యులు సభకు వచ్చారు.

Updated Date - 2021-11-19T15:14:56+05:30 IST