Abn logo
Jul 8 2020 @ 03:15AM

మా ఉద్యమం అభివృద్ధి కోసం

  • 203వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల నిరసనలు

తుళ్లూరు, జూలై 7: అమరావతి కోసం 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులను ప్రభుత్వం గుర్తించాని రాజధాని రైతులు కోరారు. మా ఉద్యమం అభివృద్ది కోసమేనని, స్వార్థప్రయోజనాల కోసం కాదని స్పష్టంచేశారు. రైతులు చేస్తున్న ఉద్యమం మంగళవారానికి 203వ రోజుకు చేరుకుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన విరమించుకోవాలని వారు కోరారు. కన్నతల్లిలాంటి తమ భూములను ప్రభుత్వానికి అప్పగించామని రైతులు స్పష్టంచేశారు. ప్రభుత్వమే మాట మీద నిలబడకుండా కొత ్తగా 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా రాజధానిగా అమరావతిని కొనసాగించి, అభివృద్ది పనులు సాగించాలని కోరారు.

Advertisement
Advertisement
Advertisement