Abn logo
Aug 18 2021 @ 19:21PM

సీఎం జగన్‌కు సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు.. విచారణకు రావాలని ఆదేశం

హైదరాబాద్: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 22న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. వాన్‌పిక్ ఈడీ కేసును న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణకు కూడా సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, ఐఆర్ టీఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డితో పాటు పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, నిమ్మగడ్డ ప్రకాష్‌కూ కోర్టు సమన్లు జారీ అయ్యాయి. విశ్రాంత ఐఏఎస్ అధికారులు ఎం.శామ్యూల్, మన్మోహన్ సింగ్‌కూ సమన్లు జారీ అయ్యాయి. జగతి పబ్లికేషన్స్ సహా 12 కంపెనీలకు సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. 


క్రైమ్ మరిన్ని...