Abn logo
Jun 10 2021 @ 21:20PM

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం జగన్‌ భేటీ

న్యూఢిల్లీ:  ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై అమిత్ షాకు సీఎం వివరించారు. జగన్‌‌తో పాటు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, పలువురు ఎంపీలు కూడా అమిత్ షాతో భేటీ అయ్యారు. 


ఈ భేటీకి నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌కుమార్‌ను సీఎం జగన్‌ కలిశారు. పేదలందరికీ ఇళ్లు పథకాన్ని ఆయనకు జగన్ వివరించారు. ఇళ్ల నిర్మాణ కార్యక్రమం కోసం ప్రతి జిల్లాకు జాయింట్‌ కలెక్టర్‌ను నియమించామని తెలిపారు. సంబంధిత మంత్రిత్వశాఖలతో మాట్లాడి ఆ కాలనీలను సంబంధించిన మౌలిక సదుపాయాల ఖర్చును పీఎంఏవైలో భాగం చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుపైనా రాజీవ్ కుమార్‌తో జగన్ మాట్లాడారు. 55 వేల 656 కోట్ల 87 లక్షల కోట్ల పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయానికి ఆమోదం తెలిపాలని రాజీవ్ కుమార్‌‌ను జగన్‌ కోరారు.


Advertisement