జాతీయ మీడియాలో పెయిడ్ ప్రచారానికి జగన్ శ్రీకారం

ABN , First Publish Date - 2020-10-30T01:05:20+05:30 IST

రాజు తలుచుకుంటే డబ్బులకు కొదవ. ఒకవైపు నిధుల కొరత అంటూ అప్పులు చేస్తున్న జగన్ సర్కార్ ఇమేజ్ బిల్డప్‌కు మాత్రం కోట్లు ఖర్చు పెట్టేస్తోంది. పేరు, ప్రతిష్టలను కొనుక్కోవడం కోసం..

జాతీయ మీడియాలో పెయిడ్ ప్రచారానికి జగన్ శ్రీకారం

రాజు తలుచుకుంటే డబ్బులకు కొదవ. ఒకవైపు నిధుల కొరత అంటూ అప్పులు చేస్తున్న జగన్ సర్కార్ ఇమేజ్ బిల్డప్‌కు మాత్రం కోట్లు ఖర్చు పెట్టేస్తోంది. పేరు, ప్రతిష్టలను కొనుక్కోవడం కోసం ప్రజల సొమ్మును వారిచ్చిన అధికారంతో ఖర్చు పెట్టేస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియాతో ప్రభుత్వం చేసుకుంది. జగన్ ఇమేజ్ పెంచే విధంగా అందులో వార్తా కథనాలు వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. దీనికోసం రిలీజ్ చేసిన జీవోలో సైతం రాష్ట్రం, రాష్ట్రానికి చెందిన నాయకుల ఇమేజ్‌ను జాతీయ వేదికపై పెంచేందుకు అని స్పష్టంగా రాసేశారు. ప్రభుత్వ సమాచార శాఖ ద్వారా ప్రభుత్వ పథకాల ప్రకటనల రూపంలో ఖర్చు పెట్టుకోవడం మామూలే. కానీ ఇలా డైరెక్ట్‌గా ప్రత్యేక జీవో ఇచ్చి ఇమేజ్ బిల్డప్ కోసమని చెప్పుకుని రూ. 8.15 కోట్ల నిధులు విడుదల చేయడం ఇదే మొదటిసారి. 


ఈ నేపథ్యంలో ‘‘జాతీయ మీడియాలో పెయిడ్ ప్రచారానికి జగన్ శ్రీకారం. అస్మదీయ మీడియాకు అడ్డగోలు వడ్డింపు. వార్తలు కాదు భజన చేయమంటూ కోట్ల నిధులు. తప్పుడు ప్రచారం కోసం ప్రజా ధనం దుర్వినియోగం.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 

Updated Date - 2020-10-30T01:05:20+05:30 IST