కాంట్రాక్టర్ల వ్యవస్థను బతికించండి

ABN , First Publish Date - 2021-10-27T05:38:14+05:30 IST

‘ప్రభుత్వం అప్పగించిన పనులు పూర్తి చేస్తూ ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తూ స్వయం ఉపాధి పొందుతున్న కాంట్రాక్టర్ల వ్యవస్థను బతికించాలని ఆంధ్రప్రదేశ్‌ బిల్డింగ్స్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కోరారు.

కాంట్రాక్టర్ల వ్యవస్థను బతికించండి

సర్పవరం జంక్షన్‌, అక్టోబరు 26: ‘ప్రభుత్వం అప్పగించిన పనులు పూర్తి చేస్తూ ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తూ స్వయం ఉపాధి పొందుతున్న కాంట్రాక్టర్ల వ్యవస్థను బతికించాలని ఆంధ్రప్రదేశ్‌ బిల్డింగ్స్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కోరారు. సర్పవరం ఆటోనగర్‌ డీజేబీ కన్వెన్షన్‌ హాల్లో స్టేట్‌ ఆంధ్రప్రదేశ్‌ బిల్డింగ్స్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ (ఎస్‌ఏబీసీఏ) సభ్యుల సమావేశం జిల్లా అధ్యక్షుడు ఎస్‌.శాంతారావు అధ్యక్షతన నిర్వహించారు. సంఘం ప్రతినిధులు శ్రీనివాసరావు, సతీ్‌ష మాట్లాడుతూ సొంత డబ్బులు వెచ్చించి కోట్లాది రూపాయలతో పనులు చేశామని, ప్రభుత్వం మూడేళ్లుగా పెండింగ్‌ బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు. ఇప్పటివరకు రైతులకే పరిమితమైన ఆత్మహత్యలు కాంట్రాక్లర్లు చేసుకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సానుభూతితో ఆర్థిక పరిస్థితిని గమనించి నవరత్నాలు పథకం తరహాలో పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని కోరారు.  జిల్లాలో చిన్న,పెద్దా కలిపి సుమారు 1000 మంది కాంట్రాక్టరు ఉన్నారని, వీరికి ప్రభుత్వం సుమారు రూ.250 కోట్లు మేర బిల్లులు బకాయి పడిందన్నారు.  ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయామన్నారు. ఎంతోకొంత నిధులు మంజూరు చేసి బిల్లులు చెల్లించి కాంట్రాక్టర్ల ఆత్మహత్యలను నివారించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు బిల్లులు మంజూరు కాక చేసిన అప్పులు తీర్చలేక ఏడుగురు కాంట్రాక్టర్లు మృతి చెందారన్నారు. సమావేశంలో కార్యదర్శి పి.సత్యనారాయణ, ట్రెజరల్‌ ఎస్‌ఆర్‌ సుబ్రహ్మణ్యం, జాయింట్‌ సెక్రటరీ కాశీ, ఆర్‌. సతీష్‌, వై.ప్రకాశరావు, ఎన్‌.ప్రసాదరావు, దూళిపూడి రాజేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-27T05:38:14+05:30 IST