APలో కొనసాగుతున్న స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్

ABN , First Publish Date - 2021-08-31T16:07:40+05:30 IST

ఏపీ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. వైద్య ఆరోగ్యశాఖ 18 ఏళ్లు పైబడిన వారికి తొలిడోసు, రెండవ డోసు కొవిడ్ టీకాలు వేస్తోంది.

APలో కొనసాగుతున్న స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్

విజయవాడ: ఏపీ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది.  18 ఏళ్లు పైబడిన వారికి  వైద్య ఆరోగ్యశాఖ తొలిడోసు, రెండవ డోసు కొవిడ్ టీకాలు వేస్తోంది. వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కోసం 2500పైగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కొవిషీల్డ్, కొవాక్జిన్‌ను వైద్య ఆరోగ్యశాఖ అందుబాటులో ఉంచింది. ఏపీలో ఇప్పటి వరకు 2,93,16,397మందికి వ్యాక్సిన్ తీసుకున్నారు.  2,11,34,164 మంది మొదటి డోసు తీసుకోగా...81,82,233 మంది రెండు డోసులు తీసుకున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వారిలో‌ 1,35,68,737 మంది పురుషులు,  1,57,42,759 మహిళలు ఉన్నారు. 60 ఏళ్లపై బడిన వారిలో  67,00,209 వ్యాక్సిన్ వేసుకున్నారు.


అలాగే 45 నుంచి 60 ఏళ్ల మధ్యలో వ్యాక్సిన్ వేసుకున్న వారి సంఖ్య 1,26,62,231గా ఉంది. 18 నుంచి 45 ఏళ్ల మధ్యలో 99,53,957 వ్యాక్సిన్ వేసుకున్నారు. కొవిషీల్డ్ వేసుకున్నవారి సంఖ్య 2,45,93,123కాగా... కోవాగ్జిన్ వేసుకున్నవారి సంఖ్య 46,68,855గా నమోదు అయ్యింది. రాష్డ్రంలోనే అత్యధికంగా విశాఖలో 29.93 లక్షల మందికి వ్యాక్సిన్ తీసుకున్నారు. అలాగే రెండవ స్ధానంలో తూర్పుగోదావరి నిలిచింది. తూర్పులో 28.56 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. తర్వాతి స్ధానాలలో కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాలు నిలిచాయి. 

Updated Date - 2021-08-31T16:07:40+05:30 IST