కృష్ణా జలాలపై ఏపీ దాదాగిరీ: కేసీఆర్‌

ABN , First Publish Date - 2021-08-03T09:05:54+05:30 IST

‘కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తెలంగాణ వ్యతిరేక వైఖరి కావచ్చు... ఆంధ్రావాళ్ల దాదాగిరీ కావచ్చు..

కృష్ణా జలాలపై ఏపీ దాదాగిరీ: కేసీఆర్‌

నల్లగొండ, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): ‘కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తెలంగాణ వ్యతిరేక వైఖరి కావచ్చు... ఆంధ్రావాళ్ల దాదాగిరీ కావచ్చు.. కృష్ణా నదిపై వారు అక్రమంగా ఏ రీతిలో ప్రాజెక్టులు కడుతున్నారో మీరూ చూస్తున్నారు. రానున్న రోజుల్లో కృష్ణా నీళ్లలో మనకు మరింత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అందుకే పాలేరు నుంచి పెద్దదేవులపల్లి రిజర్వాయర్‌కు గోదావరి నీటిని మళ్లించేందుకు సర్వే చేశాం. సాగర్‌ ఆయకట్టుకు ఎలాంటి నష్టం జరగకుండా శాశ్వత పరిష్కారం ఉండేలా చూస్తాం’అని సీఎం కేసీఆర్‌ అన్నారు. నల్లగొండ జిల్లా హాలియాలో నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ప్రగతిపై సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాలను ప్రస్తావించారు.

Updated Date - 2021-08-03T09:05:54+05:30 IST