ప్రజా ప్రభుత్వమే ఆర్థిక నేరాలకు పాల్పడడం దావాళా కాదా?

ABN , First Publish Date - 2021-08-03T01:26:25+05:30 IST

ప్రజా ప్రభుత్వమే ఆర్థిక నేరాలకు పాల్పడడం దావాళా కాదా?

ప్రజా ప్రభుత్వమే ఆర్థిక నేరాలకు పాల్పడడం దావాళా కాదా?

అమరావతి: రకరకాల బిజినెస్‌లు చూసి, అందులో బాగా ఆరితేరి.. నిపుణుడైన ఛార్టర్డ్ అకౌంటెంట్‌ను తోడుపెట్టుకుని ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి డబ్బులను ఆర్జించారని వైఎస్ జగన్‌పై ఆరోపణలు, కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో విచారణ కొనసాగుతోంది. ఇవి వ్యాపార వేత్తగా వ్యాపారం చేశారు అని అనుకోవచ్చు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు క్విడ్ ప్రోకో‌కు పాల్పడ్డారనేది మరో రకమైన ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా పూర్తిగా జగన్ ప్రైవేటు వ్యవహారంగా చెప్పవచ్చు. అయితే జగన్ ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఎలా చేశాడనే చర్చలు నడుస్తూనే ఉన్నాయి. 


కానీ చట్ట ప్రకారం పని చేయాల్సిన ప్రభుత్వం చేయడాన్ని ఎవరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక్కడ కూడా ప్రైవేటు కార్పొరేషన్లు పెట్టి.. ఆ కార్పొరేషన్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని చూపించి బ్యాకులు దగ్గర అప్పు తీసుకురావడం, రాబోయే కాలంలో వచ్చే ఆదాయాన్ని ఒక ఎస్‌క్రో అకౌంట్‌ను క్రియేట్ చేసి బ్యాకులు దగ్గర తాకట్టు పెట్టిన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. పూర్తిగా మద్య నిషేధం చేస్తానని చెప్పిన జగన్.. దాన్ని చూపించి రూ.21 వేల కోట్లు అప్పులు తీసుకొచ్చారు. ఈ వ్యవహారమంతా సంక్షేమ పథకాల పేరుతో ప్రజల కళ్లకు గంతలు కట్టమేనని బల్లగుద్ది మరీ చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి ఒక్కొక్కరిపై రూ.2.5 లక్షలు అప్పు ఉంది. 


ఈ నేపథ్యంలో ‘‘ప్రజా ప్రభుత్వమే ఆర్థిక నేరాలకు పాల్పడడం దావాళా కాదా?. రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన ప్రభుత్వమే రాజ్యాంగాన్ని ధిక్కరించడమేంటి?. వీళ్లు సృష్టిస్తున్నవి ప్రభుత్వ కార్పొరేషన్లా? సూట్కేస్ కంపెనీలా?. అక్రమంగా సృష్టించిన కార్పొరేషన్ లావాదేవీలకు బాధ్యులెవరు?. అన్నీ తెలిసే గవర్నర్ కార్యాలయాన్ని తప్పుదోవ పట్టించారా?. వెనుకా ముందు చూసుకోని కొన్ని బ్యాంకులు కూడా పెద్దల వలలో పడ్డాయా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్కజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 



Updated Date - 2021-08-03T01:26:25+05:30 IST