Abn logo
Oct 9 2021 @ 17:16PM

ఏపీలో అభివృద్ధి దిగజారిపోయింది: పవన్‌

హైదరాబాద్: ఏపీలో అభివృద్ధి దిగజారిపోయిందని జనసేన అధినేత పవన్‌‌కల్యాణ్‌ విమర్శించారు. హైదరాబాద్‌లో జనసేన కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు కులాల మధ్య పోరాటం జరుగుతోంది. అభివృద్ధిని అడ్డుకునే వారు ఎవరైనా సరే బద్ధ శత్రువులే. రాజకీయ నేతలు నాకు శత్రువులు కారు. ప్రపంచం మారాలి. సమాజం మారాలని కోరుకుంటాం. ఏదైనా సరే అడుగుపెడితే తప్ప అనుభవం రాదు. గెలుస్తామా.. ఓడుతామా నాకు తెలియదు. నేను రాజకీయాల్లోకి వస్తుంటే భయపెట్టారు. మార్పు కోసం.. బలమైన సామాజిక మార్పుకోసం రాజకీయాల్లోకి వచ్చా. అన్నిటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చా. రాజకీయాల్లో మత ప్రస్తావన ఉండకూడదు. కులం, మతం, రంగు, ప్రాంతం మనకు తెలియకుండా జరిగిపోతాయ్‌. కులాలను రెచ్చగొట్టడం నా ఉద్దేశం కాదు’’ అని పవన్‌‌కల్యాణ్‌ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption