Abn logo
Sep 28 2020 @ 18:08PM

ఈ ఏడాది దేవాలయాలపై దాడులు జరిగింది తక్కువే: డీజీపీ

Kaakateeya

అమరావతి: అంతర్వేది ఘటన తర్వాత దేవాలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. ఆలయాల మీద దాడులపై 19 కేసులు నమోదు, 12 మంది అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఆలయాలపై దాడులన్నీ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా జరిగినవేనని తేల్చిచెప్పారు. గత ఐదేళ్లతో పోలిస్తే 2020లో దేవాలయాలపై జరిగిన దాడులు తక్కువే అన్నారు. గత ఆరేళ్లల్లో ఇలాంటి నేరాలకు పాల్పడిన 8,204 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో నంది విగ్రహాన్ని దుండగులు అపవిత్రం చేశారని ఫిర్యాదు వచ్చిందని, దానిపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 47,593 ప్రార్ధనా మందిరాలు ఉండగా 10 శాతం మందిరాల్లోనే సీసీ కెమెరాలు ఉన్నట్లు తెలిపారు. మిగిలిన మందిరాలలో సీసీ కెమెరాలు అమర్చాలని నిర్వాహకులకు నోటీసులు ఇచ్చామన్నారు. శ్రీకాకుళంలో వర్షాల కారణంగానే దేవుడి విగ్రహం చెయ్యి విరిగిందని వివరించారు. కర్నూలులో విగ్రహం అపహరించిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు డీజీపీ వెల్లడించారు.

Advertisement
Advertisement
Advertisement