ప్రతి జిల్లాలో ఆత్యాధునిక సైబర్‌ సెల్‌, సోషల్‌ మీడియా ల్యాబ్స్‌ ఏర్పాటు: డీజీపీ

ABN , First Publish Date - 2022-01-18T00:23:55+05:30 IST

సైబర్‌ నేరాలు అరికట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఆత్యాధునిక సైబర్‌ సెల్‌, సోషల్‌ మీడియా ల్యాబ్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు డీజిపి గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు.

ప్రతి జిల్లాలో ఆత్యాధునిక సైబర్‌ సెల్‌, సోషల్‌ మీడియా ల్యాబ్స్‌ ఏర్పాటు: డీజీపీ

విజయవాడ: సైబర్‌ నేరాలు అరికట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఆత్యాధునిక సైబర్‌ సెల్‌, సోషల్‌ మీడియా ల్యాబ్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు డీజిపి గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు. ఇటీవల కాలంలో OTP, BITCOIN, బీమా సంస్థల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. విధులు నిర్వహించేందుకు బీటెక్‌ పరిజ్ఞానం కలిగిన ఒక ఎస్‌ఐ, ఐదుగురు కానిస్టేబుల్లను ఎంపిక చేయడం జరిగిందన్నారు. మొదటి విడతల భాగంగా విజయనగరం, ఒంగోలు, అనంతపురం పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో  మొత్తం 300 మంది శిక్షణ ఇస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 20 వేల మందిని ఎంపిక చేసి విడతల వారీగా సైబర్‌ క్రైమ్‌ నేరాల నియంత్రణకు శిక్షణ ఇస్తామన్నారు. సైబర్‌ నేరాల కేసుల దర్యాప్తు కూడా అత్యంత వేగవంతంగా కొనసాగుతోందని చెప్పారు. రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన సైబర్‌ సెల్‌, సోషల్‌ మీడియా ల్యాబ్‌ ద్వారా జిల్లాస్థాయి సిబ్బందికి సూచనలు అందచేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న 1551 ప్రొఫైల్‌ను గుర్తించి వారిపై సైబర్‌ బుల్‌ షీట్స్‌ ఓపెన్‌ చేస్తామన్నారు. సైబర్‌ నేరచరిత్ర కలిగిన వారి పై అనునిత్యం వారి కదలికలపై ప్యతేక నిఘా ఉంటుందన్నారు. 

Updated Date - 2022-01-18T00:23:55+05:30 IST