Advertisement
Advertisement
Abn logo
Advertisement

గుజరాత్‌లో డ్రగ్స్ దొరికితే ఏపీ ఎందుకు వణుకుతోంది?

అమరావతి/హైదరాబాద్: విజయవాడ డ్రగ్స్ కేసు తవ్వినకొద్దీ డొంక కదులుతోంది. డ్రగ్స్ వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు చేయాలని డీఆర్‌ఐ అధికారులు నిర్ణయించారు. గతంలో ఇటువంటి కన్సైన్మెంట్‌లు వచ్చాయా అనే కోణంలో ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. దీంతో సెంట్రల్ విజిలెన్స్, నార్కోటిక్ బ్యూరో, కస్టమ్స్ అండ్ ఎక్సైజ్, నేవీ ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. డ్రగ్స్ విలువ రూ. 21 వేల కోట్లుగా అంచనా వేశారు. సుధాకర్ దంపతులను చెన్నైలో అదుపులోకి తీసుకున్న అధికారులు గుజరాత్‌కు తరలించి.. కోర్టులో హాజరు పర్చగా సుధాకర్‌ దంపతులను పదిరోజుల డీఆర్‌ఐ కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. మనీలాండరింగ్ కోణంపై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ‘‘ఏపీలో మాదక ద్రవ్యాల మాఫియా కూడా పురుడు పోసుకుంటుందా?. గుజరాత్‌లో డ్రగ్స్ దొరికితే ఏపీ ఎందుకు వణుకుతోంది?. ముంద్రా పోర్టులో డ్రగ్స్ పట్టుబడితే కాకినాడలో డొంక ఎందుకు కదిలింది?.  వేల కోట్ల డ్రగ్ రాకెట్‌ను విజయవాడ వాసి ఒక్కటే నడుపుతున్నాడా?. డ్రగ్స్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఎలా ఉంది?. దేశంలోని పోర్టులన్నింటినీ ఆక్రమిస్తున్న అదానీపై విమర్శలు ఎందుకొస్తున్నాయి.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement