Abn logo
Sep 25 2021 @ 15:50PM

డ్రగ్స్‌కు ఏపీ కేరాఫ్‌గా మారింది: జీవీ ఆంజనేయులు

గుంటూరు: డ్రగ్స్‌కు ఏపీ కేరాఫ్‌గా మారిందని టీడీపీ నేత జీవీ ఆంజనేయులు దుయ్యబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ ఏపీని మాఫియా రాష్ట్రంలా తయారు చేశారని ధ్వజమెత్తారు. అఫ్ఘనిస్తాన్ నుంచి ఏపీకి నేరుగా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని, జగన్ సీఎం అయిన మరుసటి రోజు నుంచే డ్రగ్స్ వ్యాపారం ప్రారంభమైందని ఆరోపించారు. డ్రగ్స్ మాఫియాకి సీఎం అండదండలున్నాయని చెప్పారు. సంపాదన కోసం వైసీపీ ఎమ్మెల్యేలు అడ్డదారులు తొక్కుతున్నారని, జగన్‌రెడ్డి పాలనలోయువత మత్తులో జోగుతోందన్నారు. డ్రగ్స్ మాఫియాకి సీఎం అండదండలున్నాయని, గుంటూరుకు చెందిన ఎమ్మెల్యే, కొడుకును విచారిస్తే డ్రగ్స్ బాగోతం అంతా బయటపడుతుందని జీవీ ఆంజనేయులు తెలిపారు.


క్రైమ్ మరిన్ని...