ఏపీ ఉద్యోగుల ఉద్యమం తాత్కాలిక విరమణకు అంగీకారం?

ABN , First Publish Date - 2021-12-17T03:35:21+05:30 IST

ఉద్యోగ సంఘాలు చేపట్టిన ఉద్యమానికి తాత్కాలికంగా విరమించేందుకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ఉద్యోగ సంఘాలతో..

ఏపీ ఉద్యోగుల ఉద్యమం తాత్కాలిక విరమణకు అంగీకారం?

అమరావతి: ఉద్యోగ సంఘాలు చేపట్టిన ఉద్యమానికి తాత్కాలికంగా విరమించేందుకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు ముగిశాయి. ఉద్యోగుల 71 డిమాండ్లపై బుధవారంలోగా ఏటీఆర్‌ కోరామని సీఎస్‌ సమీర్ శర్మ తెలిపారు. పరిష్కారం కాని సమస్యలపై ముఖ్య కార్యదర్శులతో చర్చించి పరిష్కరిస్తామని సీఎస్‌ సమీర్‌శర్మ పేర్కొన్నారు. 


ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఏపీ సచివాలయానికి సంబంధించి 11 అంశాలు, ఉద్యోగులకు సంబంధించిన 85 అంశాలు నివేదించామని ఆయన చెప్పారు. సచివాలయంలో అదనపు పోస్టులను భర్తీ చేయాలని కోరామన్నారు. అసెంబ్లీ ఉద్యోగులకు అమరావతిలో ఇళ్ల స్థలాలివ్వాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. జిల్లాల్లో ఉద్యోగులకు స్థానికంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరినట్లు వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. 


Updated Date - 2021-12-17T03:35:21+05:30 IST