Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎస్మా ఉపయోగిస్తే, ఉద్యమం మరింత ఉదృతం చేస్తాం: బొప్పరాజు

కర్నూలు: తమ 71 డిమాండ్లపై ప్రభుత్వం చర్చలు జరిపి.. ఒప్పందం కుదుర్చుకోకపోతే రెండోదశ ఉద్యమం తీవ్రంగా ఉంటుందని ఏపీ అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. జగన్ ప్రభుత్వం ఎస్మా లాంటి చర్యలకు పూనుకుంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. తమకు ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు ఆపాదించొద్దని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ మంగళవారం కర్నూలు జిల్లా నుంచి ఉద్యమం ప్రారంభించామన్నారు. మూడు రోజులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతామన్నారు. 13వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు ప్రారంభమవుతాయన్నారు. అలాగే 16న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తామన్నారు. 21న 13 జిల్లాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నాలు చేస్తామన్నారు. 27 నుంచి ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామన్నారు. అప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోతే తమ ఉద్యమం తీవ్రరూపం దాలుస్తుందని బొప్పరాజు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement