రేపటి నుంచే ఎంసెట్‌

ABN , First Publish Date - 2020-09-16T09:19:31+05:30 IST

రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు ఏపీ ఎంసెట్‌-2020

రేపటి నుంచే ఎంసెట్‌

  • నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ 
  • విద్యార్థులకు మాస్క్‌ తప్పనిసరి 

అమరావతి, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు ఏపీ ఎంసెట్‌-2020 నిర్వహించనున్నారు. 17 నుంచి 23 వరకు ఇంజనీరింగ్‌, 23 నుంచి 25 వరకు మెడిసిన్‌,అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌ పరీక్షలుంటాయి. ఏపీ, తెలంగాణల్లో కలిపి మొత్తం 2,72,933 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. రోజూ ఉదయం 9 నుంచి 12 గం. వరకు, సాయంత్రం 3 నుంచి 6 గం. వరకు పరీక్ష జరుగుతుంది. ఏపీలో 115, తెలంగాణ(హైదరాబాద్‌)లో 3 సెంటర్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులను పరీక్ష హాల్లోకి గంటన్నర ముందు నుంచే అనుమతిస్తారు.


నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. హాల్‌టికెట్లను https://sche. ap.gov.in/ eamcet వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. ఇతర వివరాలకు 0884 2340535, 2356255 నంబర్లలో సంప్రదించాలని జేఎన్టీయూకే సెట్‌ కన్వీనర్‌ వి.రవీంద్ర తెలిపారు. కాగా, ప్రతి విద్యార్థి మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం తప్పనిసరి. మాస్క్‌, గ్లోవ్స్‌, శానిటైజర్‌, వాటర్‌ బాటిల్‌ను  అనుమతిస్తారు. వీటిని విద్యార్థులే తెచ్చుకోవాలి. పరీక్షా కేంద్రంలో బయోమెట్రిక్‌ బదులు ఫేస్‌ రికగ్నైజేషన్‌ విధానంలో విద్యార్థుల ఫోటోలు తీసుకుంటారు. విద్యార్థులు తమకు కరోనా లక్షణాలు లేవని సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇవ్వాలి.  

Updated Date - 2020-09-16T09:19:31+05:30 IST