ఏపీలో గ్యాస్‌ లీకేజీలపై ఎన్జీటీ సుమోటో

ABN , First Publish Date - 2020-07-05T07:43:32+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రెండు గ్యాస్‌ లీకేజీ ఘటనలపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) సుమోటోగా కేసు నమోదు చేసింది. విశాఖపట్నంలో సాయినార్‌ ఫార్మా...

ఏపీలో గ్యాస్‌ లీకేజీలపై ఎన్జీటీ సుమోటో

న్యూఢిల్లీ, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రెండు గ్యాస్‌ లీకేజీ ఘటనలపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) సుమోటోగా కేసు నమోదు చేసింది. విశాఖపట్నంలో సాయినార్‌ ఫార్మా కంపెనీతో పాటు కర్నూలు జిల్లాలోని ఎస్‌పీవై ఆగ్రో సంస్థల్లో ఇటీవల జరిగిన గ్యాస్‌ లీకేజీ ఘటనలపై సోమవారం విచారణ ప్రారంభించనుంది. దీనిపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)ని వివరణ కోరింది. సాయినార్‌ ఫార్మా కంపెనీ అంశంపై పీసీబీ ఎన్జీటీకి నివేదిక సమర్పించింది. కంపెనీ భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే గ్యాస్‌ లీకేజీ జరిగిందని స్పష్టం చేసింది.

Updated Date - 2020-07-05T07:43:32+05:30 IST