ఏపీలో రేపటి నుంచి బార్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి

ABN , First Publish Date - 2020-09-19T03:09:39+05:30 IST

ఏపీలో రేపటి నుంచి బార్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. బార్ల లైసెన్సులపై...

ఏపీలో రేపటి నుంచి బార్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి

అమరావతి: ఏపీలో రేపటి నుంచి బార్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. బార్ల లైసెన్సులపై 20 శాతం కోవిడ్ రుసుము విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బార్ల మద్యం విక్రయాలపై 10 శాతం అదనపు రిటైల్ ట్యాక్స్, విదేశీ మద్యం, దేశంలో తయారైన విదేశీ మద్యంపై 10 శాతం ఏఈఆర్టీ విధించింది.


బీర్లు, రెడీ టూ డ్రింక్ మద్యంపై 10 శాతం ఏఈఆర్టీని ప్రభుత్వం విధించింది. 840 బార్ల లైసెన్సులను కొనసాగించాలని ఏపీ ఆబ్కారీ శాఖ నిర్ణయించింది. 2021 జూన్ 30 వరకు బార్ల లైసెన్స్ కొనసాగిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లైసెన్స్‌ రిజిస్ట్రేషన్ చార్జీలు 10 శాతం మేర ప్రభుత్వం పెంచింది.

Updated Date - 2020-09-19T03:09:39+05:30 IST