Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పోరు బాట

అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పోరు బాటు రెడీ అవుతున్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ ఎన్జీవో జేఏసీ సంయుక్త కార్యాచరణ ప్రకటించింది. డిసెంబర్ 1న సీఎస్‌ సమీర్ శర్మకు ఉద్యోగ సంఘాలు నోటీసు ఇవ్వనున్నాయి. డిసెంబర్‌ 7 నుంచి 10వ తేదీ వరకు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై.. భోజన విరామంలో నిరసన తెలపాలని నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు తాలూకా కేంద్రాల్లో నిరసనలు తెలిపాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే డిసెంబర్ 16 నుంచి అన్ని తాలూకా కేంద్రాల్లో ధర్నాలకు పిలుపునిచ్చారు. డిసెంబర్ 21 నుంచి 26 వరకు జిల్లా ప్రధాన కేంద్రాల్లో ధర్నాలు, డిసెంబర్ 27న విశాఖ, 30న తిరుపతి, జనవరి 3న ఏలూరు, జనవరి 6న ఒంగోలులో ఉద్యోగ సంఘాల ప్రాంతీయ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

Advertisement
Advertisement