ప్రభుత్వ వ్యవహారశైలి విడ్డూరంగా ఉంది: వర్ల రామయ్య

ABN , First Publish Date - 2021-08-19T23:29:46+05:30 IST

ప్రభుత్వ వ్యవహారశైలి చాలా విడ్డూరంగా ఉందని టీడీపీ నేత వర్ల రామయ్య దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో

ప్రభుత్వ వ్యవహారశైలి విడ్డూరంగా ఉంది: వర్ల రామయ్య

అమరావతి: ప్రభుత్వ వ్యవహారశైలి చాలా విడ్డూరంగా ఉందని టీడీపీ నేత వర్ల రామయ్య దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ అఘాయిత్యం, అన్యాయం, అరాచకం జరిగినా డబ్బుతో అణచివేయాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడే పట్టపగలు నడిరోడ్డుపై యువతిని.. దారుణంగా చంపేస్తే ముఖ్యమంత్రి జగన్‌లో చలనం లేదని వర్ల రామయ్య తప్పుబట్టారు. దుండగుడిని పట్టుకొని కఠినాతి కఠినంగా శిక్షించాల్సిన ప్రభుత్వం.. బాధిత కుటుంబానికి డబ్బులిచ్చి, సర్దుబాబు చేయడం ఘోరమని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-08-19T23:29:46+05:30 IST