Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆదాయం లేని రాష్ట్రంగా ఏపీ రికార్డు: యనమల

అమరావతి: అప్పులు తప్ప.. ఆదాయం లేని రాష్ట్రంగా ఏపీ రికార్డు నెలకొల్పిందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఎద్దేవాచేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంక్షేమంలో గత ప్రభుత్వం కన్నా ఇప్పటి ప్రభుత్వం తక్కువ ఖర్చు చేసిందని చెప్పారు. ఆర్థిక అసమానతలు 32 నుంచి 43 శాతానికి పెరిగాయని, పేదరికంలో ఏపీ 6వ స్థానం నుంచి 2వ స్థానానికి దిగజారిందని తెలిపారు. సీఎం జగన్‌ పాలనలో అప్పులే తప్ప.. ఆదాయ మార్గాల్లేవని విమర్శించారు. ఏపీ తెచ్చిన అప్పులకూ లెక్కాపత్రం లేదని తప్పుబట్టారు. వైసీపీ ప్రభుత్వం రూ.2.68 లక్షల కోట్ల అప్పులు తెచ్చిందని, సంక్షేమానికి రూ.68,632 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. మిగిలిన రూ.1.99 లక్షల కోట్లు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. సంక్షేమంపై ఖర్చులో దేశంలో రాష్ట్రానిది 18వ స్థానంలో ఉందని యనమల రామకృష్ణుడు తెలిపారు.

Advertisement
Advertisement