RBI నుంచి ఏపీ ప్రభుత్వానికి మరో వెయ్యి కోట్ల రుణం.. ఈ సారి భారీ వడ్డీ!

ABN , First Publish Date - 2021-11-09T21:29:04+05:30 IST

వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ నుంచి మరో వెయ్యి కోట్ల రుణాన్ని సేకరించింది.

RBI నుంచి ఏపీ ప్రభుత్వానికి మరో వెయ్యి కోట్ల రుణం.. ఈ సారి భారీ వడ్డీ!

అమరావతి: వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ నుంచి మరో వెయ్యి కోట్ల రుణాన్ని సేకరించింది. ఆర్బీఐ వద్ద సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా వెయ్యి కోట్ల రూపాయలను పొందింది. వేలంలో 5 రాష్ట్రాలు పాల్గొనగా.. ఏపీ ప్రభుత్వం అత్యధిక వడ్డీ 7 శాతం చెల్లించి మరీ రుణాన్ని సొంతం చేసుకుంది. 17 సంవత్సరాలకు 500 కోట్లు, 18 సంవత్సరాలకు మరో 500 కోట్లు రుణాన్ని సమీకరించింది. దీంతో కేంద్రం ఇచ్చిన అదనపు రుణ పరిమితిలో ఏపీకి 150 కోట్లు మాత్రమే మిగిలాయి. అయితే మళ్లీ అదనపు రుణ పరిమితి కోసం కేంద్రం వద్ద ఆర్ధిక శాఖ అధికారులు పడిగాపులు కాస్తున్నారు. అదనపు రుణపరిమితి ఇవ్వకపోతే రాష్ట్రం మరింతగా ఆర్ధిక కష్టాలు ఎదుర్కోకతప్పదు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం మెడపై పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డిఫాల్టర్‌ కత్తి వేలాడుతోంది.

Updated Date - 2021-11-09T21:29:04+05:30 IST