ఎన్జీటీ ఆదేశించినా ప్రభుత్వం మైనింగ్ ఆపలేదు: మాజీమంత్రి నక్కా

ABN , First Publish Date - 2021-08-06T20:43:47+05:30 IST

ఎన్జీటీ ఆదేశించినా ప్రభుత్వం మైనింగ్ ఆపలేదని మాజీమంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు

ఎన్జీటీ ఆదేశించినా ప్రభుత్వం మైనింగ్ ఆపలేదు: మాజీమంత్రి నక్కా

విశాఖ: ఎన్జీటీ ఆదేశించినా ప్రభుత్వం మైనింగ్ ఆపలేదని మాజీమంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పినప్పుడే ప్రభుత్వం ఖాతరుచేయలేదని, ఎన్జీటీ ఆదేశాలను ప్రభుత్వం గౌరవిస్తుందని అనుకోవడం లేదన్నారు. కొండపల్లి అటవీ భూములను రెవెన్యూ భూములుగా మార్చింది... అక్రమ మైనింగ్‌కు అనుమతులిచ్చింది మాజీ సీఎం వైఎస్సార్ హయాంలోనేనని గుర్తుచేశారు. అక్రమ మైనింగ్‌పై చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్‌కు ఫిర్యాదు చేయబోతున్నామని ప్రకటించారు. అక్రమ మైనింగ్‌కు చెక్ పెట్టేవరకు టీడీపీ ఊరుకోదని  నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు.

Updated Date - 2021-08-06T20:43:47+05:30 IST