నిమ్మగడ్డ వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్‌

ABN , First Publish Date - 2020-06-01T23:08:35+05:30 IST

నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ప్రభుత్వం ఆశ్రయించింది.

నిమ్మగడ్డ వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్‌

అమరావతి: నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ప్రభుత్వం ఆశ్రయించింది. ఈ మేరకు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌‌ను ప్రభుత్వం దాఖలు చేసింది. పిటిషన్‌పై రేపు లేదా ఎల్లుండి విచారణకు వచ్చే అవకాశం ఉంది. హైకోర్టు ఇచ్చిన తీర్పులోని అభ్యంతరాలను పిటిషన్‌లో ప్రభుత్వం లేవనెత్తినట్లు సమాచారం. ఎన్నికల కమిషనర్‌ను నియమించే అధికారం ప్రభుత్వానికి ఉందని, ప్రభుత్వానికి ఉన్న హక్కల మేరకే కమిషనర్‌గా కనగరాజును నియమించామని ప్రభుత్వం చెబుతోంది. కమిషనర్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టాలని, కనగరాజు నియాయకం చెల్లుతుందని ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టును ప్రభుత్వం అభ్యర్థించింది. 


ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో ఆయన భేటీ కానున్నారు. షాతో భేటీ అనంతరం పలువురు కేంద్ర మంత్రులు, కీలక అధికారులతో జగన్ భేటీ అవుతారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ భేటీలు ముగిసిన తర్వాత రమష్‌కుమార్‌పై ప్రభుత్వం పిటిషన్‌పై న్యాయనిపుణులతో జగన్ సమావేశమవుతారని సమాచారం.

Updated Date - 2020-06-01T23:08:35+05:30 IST