ఆదాయం తెచ్చుకోవడం ప్రభుత్వానికి చేతకావడం లేదు: రామ్మోహన్‌నాయుడు

ABN , First Publish Date - 2022-01-07T02:13:56+05:30 IST

ఆదాయం తెచ్చుకోవడం ప్రభుత్వానికి చేతకావడం లేదని ఎంపీ రామ్మోహన్‌నాయుడు తప్పుబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

ఆదాయం తెచ్చుకోవడం ప్రభుత్వానికి చేతకావడం లేదు: రామ్మోహన్‌నాయుడు

శ్రీకాకుళం: ఆదాయం తెచ్చుకోవడం ప్రభుత్వానికి చేతకావడం లేదని ఎంపీ రామ్మోహన్‌నాయుడు తప్పుబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పన్నుల పేరుతో పేదలను వేధిస్తున్నారని మండిపడ్డారు. చెత్తపై పన్ను వేయడం దేశంలోనే ఎక్కడా లేదన్నారు. పన్ను కట్టకపోతే చెత్త ఇంటి ముందు వేయాలని ధర్మాన చెప్పడం దారుణమన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల వ్యాఖ్యలు చూస్తుంటే.. ప్రభుత్వానికి పాలన చేతకాదని అర్థమౌతోందని రామ్మోహన్‌నాయుడు విమర్శించారు.

Updated Date - 2022-01-07T02:13:56+05:30 IST