కొవిడ్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు

ABN , First Publish Date - 2022-01-18T21:18:37+05:30 IST

కొవిడ్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది.కొవిడ్ పరీక్ష కిట్ల పంపిణీని ప్రభుత్వం పూర్తిగా తగ్గించేసింది.

కొవిడ్ పరీక్షలపై  ఏపీ ప్రభుత్వం ఆంక్షలు

తిరుపతి: కొవిడ్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కొవిడ్ పరీక్ష కిట్ల పంపిణీని  ప్రభుత్వం పూర్తిగా తగ్గించేసింది. గతంలో పరీక్షలు అధికంగా చేయాలని  వైసీపీ ప్రభుత్వమే చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు పూర్తిగా పరీక్షలు చేయకుండా వైద్య సిబ్బందిపై ప్రభుత్వం వత్తిడి చేస్తోంది. దీంతోపలు హెల్త్ సెంటర్లలకు వెళ్లి కొవిడ్ పరీక్షలు చేయమని కోరిన బాధితులను, తిరుపతి రుయాకు వెళ్లాలని సిబ్బంది చెబుతున్నారు. తిరుపతి పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్లలోనూ కొవిడ్ నిర్దారణ పరీక్షలను నిలిపివేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.ప్రైవేటు ల్యాబుల్లో, ఆస్పత్రుల్లో మాత్రమే కొవిడ్ పరీక్షలు అందుబాటులో ఉండటంతో ఏమి చేయాలో తోచక జనం అల్లాడుతున్నారు. చిత్తూరులోని ఓ ఉన్నతాధికారితో సమావేశం కావాలని ప్రైవేటు ల్యాబుల నిర్వాహకులకు ఆదేశించారు.

Updated Date - 2022-01-18T21:18:37+05:30 IST